Home / తాజా వార్తలు
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్, ఆర్మీ పోస్ట్ లు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కాగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లో […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని […]
India- Pak War: పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులను హతం చేసింది. కాగా భారత్ జరిపిన […]
Guru Asta In Mithun: జ్యోతిష్యశాస్త్రంలో.. గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా పిలుస్తారు. బృహస్పతిని పిల్లలు, విద్య, వైవాహిక ఆనందం, శ్రేయస్సు, వివాహం, జ్ఞానానికి కారకుడిగా పరిగణిస్తారు. త్వరలో గురుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఇది 2025 సంవత్సరంలోనే రెండవ ప్రధాన సంచారము. మే 14న రాత్రి 11:20 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. 12 జూన్ 2025న సాయంత్రం 7:37 గంటలకు అస్తమిస్తాడు. బృహస్పతి అస్తమించినప్పుడు.. మేషం, వృషభం, ధనుస్సు రాశుల వారు ప్రత్యేక […]
Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే వన్డే క్రికెట్ మాత్రం తాను కొనసాగుతానని వెల్లడించారు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన రోహిత్ శర్మ.. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. […]
Tamilnadu: డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజాకు పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మైలాదుతురైలో నిర్వహించిన పార్టీ సభలో మాట్లాడుతుండగా భారీ లైట్ సెట్ వేదికపైకి కూలింది. ఎంపీ రాజా ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే బలంగా వీచిన గాలుల వల్లే లైట్ స్టాండ్ కదిలిందని, అది కాస్తా వేదికపైకి పడిపోయిందని పలువురు చెప్తున్నారు. సభలో ప్రమాదం జరగడంతో డీఎంకే నేతలంతా […]
Kohinoor : బ్రిటన్ మహారాణి ధరించిన కోహినూర్ వజ్రం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేస్తారా? అన్న ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖల మంత్రి లీసా నాండీ బదులు ఇచ్చారు. ఇండియా, బ్రిటన్ రెండు దేశాల మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అనుకున్నట్లు జరిగితే మంచి నిర్ణయం రావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఇండియా సాంస్కృతిక శాఖ […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఇవాళ జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 95 పరుగులతో రాజస్థాన్ కెప్టెన్ పూరన్ చేసిన పోరాటం వృథా అయిపోయింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.. అందుకే గెలుపుకోసం ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో […]
Cricket: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా విమెన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం 276 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక 49.1 […]