Tata Motors: ఉత్కంఠ రేపుతున్న టాటా.. హారియర్, సియెర్రా ఈవీలు దూసుకొస్తున్నాయ్.. బ్యాటరీ ఫుల్ చేస్తే చాలు..!

Tata Motors: టాటా మోటార్స్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలను విజయవంతంగా విక్రయిస్తూ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కూడా కంపెనీ తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది సరికొత్త హారియర్ ఈవీ, సియెర్రా ఈవీలను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రండి.. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
Tata Harrier EV
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ చాలా వరకు మార్చి నెలలో విడుదల చేయాలని భావిస్తుంది. జనవరిలో న్యూఢిల్లీలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హారియర్ ఈవీని ప్రవర్శించింది. ఈ కారు ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో చక్కని ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కనిపిస్తుంది.
ఈ టాటా హారియర్ ఈవీలో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజీ) ఇవ్వవచ్చని కంపెనీ తెలిసింది. ఇందులో డ్యూయల్-మోటార్ సెటప్, ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని కూడా ఉంటుందని భావిస్తున్నారు.
కొత్త టాటా హారియర్ ఈవీలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, 6-వే పవర్ డ్రైవర్ సీట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో సహా వివిధ ఫీచర్స్ ఉంటాయని భావిస్తున్నారు. హారియర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.30 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.
Tata Sierra EV
ఇది కూడా ఒక ఎస్‌యూవీ. ముందుగా ఈ అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ రూపంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇంధనంతో నడిచే (పెట్రోల్/డీజిల్) ఆప్షన్‌లో సేల్‌కి వస్తుందని అంచనా. ప్రొడక్షన్‌కి సిద్ధంగా ఉన్న సియెర్రా కూడా భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కారులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్లు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఈ సియెర్రా ఈవీలో 3 స్క్రీన్ సెటప్, 4 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అలానే పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం-సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్‌తో సహా పలు ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
కొత్త ఎలక్ట్రిక్ కారులో భారీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజీ) ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఈ కారు ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా. దీని ధర రూ. 25 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.