Nissan Magnite Facelift: రికార్డుల మోత.. మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌కు మైండ్ బ్లోయింగ్ డిమాండ్.. ఫీచర్లు ఓ రేంజ్లో ఉన్నాయ్..!
Nissan Magnite Facelift: నిస్సాన్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే ధరను పెంచకుండానే ఈ వాహనంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చేసి అదనపు ఫీచర్లను కూడా అందించింది. కొత్త అవతార్‌లో వచ్చిన వెంటనే కొత్త మ్యాగ్నైట్ ధర పెరిగింది. మాగ్నైట్ గత నెలలో 3,119 యూనిట్లను విక్రయించగా, గతేడాది కంపెనీ 2,573 యూనిట్లను విక్రయించింది. ఈసారి కంపెనీ ఈ వాహనాన్ని 546 యూనిట్లను విక్రయించింది. కొత్త మాగ్నైట్ అనేక విధాలుగా గొప్ప ఎస్యూవీ. మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ఫీచర్ల గురించి తెలుసుకోండి.
Mileage
కొత్త మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0L నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్లు 6-స్పీడ్ MT లేదా CVT గేర్‌బాక్స్‌తో వస్తాయి. కొత్త మాగ్నైట్ మీకు 20kmpl వరకు మైలేజీని అందిస్తుంది.
Airbags
నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు భద్రత కోసం మరింత అధునాతనంగా మారింది. తొలిసారిగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లను చూడొచ్చు.
Design
కొత్త మాగ్నైట్ డిజైన్‌లో పెద్దగా ఏమీ మార్పు లేదు. కొత్త ఫ్రంట్ గ్రిల్‌తో పాటుగా అప్డేట్ చేసిన ఫ్రంట్ బంపర్ జోడించారు. మారంగ్ స్టైల్డేటైమ్ రన్నింగ్ లైట్ దాని బంపర్ కంటే తక్కువగా ఉంచారు. ఇది మాత్రమే కాదు ఆటోమేటిక్ LED హెడ్లైట్లు ఇప్పుడు చూడొచ్చు. ఇందులో మల్టీ-ఫంక్షనల్ ప్రొజెక్టర్ కూడా ఉంది. దీనికి కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది కాకుండా వెనుక లుక్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది.
కారు లోపలి భాగం కూడా మునుపటి కంటే కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు క్యాబిన్ ఆల్-లెదర్ ట్రీట్మెంట్తో వస్తుంది. ఇందులో వైర్లెస్ ఛార్జర్ పీచర్ ఉంది. ఇది మాత్రమే కాదు 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కొత్త గ్రాఫిక్స్ కనిపిస్తాయి. కొత్త మాగ్నైట్‌లో సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. కొత్త మాగ్నైట్‌లో క్లస్టర్ అయానైజర్ను అమర్చారు. దీని సహాయంతో వాహనం లోపల గాలిని శుభ్రం చేయొచ్చు. దీనితో పాటు హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగించవచ్చు.
Price
నిసాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 11.50 లక్షల వరకు ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ విసియా, విసియా+, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా+ వంటి 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర పెరగకపోవడం ఈ వాహనానికి పెద్ద ప్లస్ పాయింట్.