Last Updated:

ఆ పని కోసం కిడ్నీ దానానికి రెడీ అయిన యువతి … కట్ చేస్తే… బురిడీ కొట్టించిన ఆన్ లైన్ నేరగాళ్ళు

ఆ పని కోసం కిడ్నీ దానానికి రెడీ అయిన యువతి … కట్ చేస్తే… బురిడీ కొట్టించిన ఆన్ లైన్ నేరగాళ్ళు

Online Fraud : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. అమాయకుల అవసరాన్ని ఆసరాగా మార్చుకుంటూ నేరగాళ్లు ఈ ఆగడాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా వినియోగిస్తున్నాము. ఈ తరుణంలోనే ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ పై ఆఫర్లు ఇస్తామని, లక్కీ డ్రా వచ్చిందని , బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు కూడా ఆన్ లైన్ మోసాలకు గురయ్యారు. కాగా ఇటువంటి ఘటన తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది.

ఫిరంగిపురం గ్రామానికి చెందిన యామిని హైదరాబాదులో నర్సింగ్ కోర్సు అభ్యసిస్తోంది. తండ్రి ఏటీఎం కార్డు ద్వారా వ్యక్తిగత అవసరాల కోసం ఆమె రూ.2 లక్షల వరకు వాడుకుంది. అయితే తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు వాడుకోవడంతో తిరిగి అడుగుతారని భావించిన యామిని ఈ విషయాలన్నీ ఇంట్లో చెప్పడానికి భయపడింది. ఇంట్లో తెలిస్తే ఏమంటారో అని భావించి తనలో తానే మదనపడుతూ ఉండేది. ఇలాంటి తరుణంలోనే ఆమెకు యూట్యూబ్‌‌లో కిడ్నీ డొనేషన్ యాప్ అని కనిపించింది. దీంతో ఆ అమ్మాయి దృష్టి దానిపైకి మళ్లింది. వెంటనే అందులో ఉన్న నంబర్‌కు తాను కిడ్నీ ఇస్తానని చెప్పి మెసేజ్ చేసింది.

దాంతో వారు ఆన్ లైన్ లో యామినిని సంప్రదించారు. యామిని అవసరాన్ని గుర్తించిన సైబర్ మోసగాళ్లు కిడ్నీ ఇవ్వడానికి ముందు రూ.3 కోట్లు.. ఇచ్చాక మరో రూ.3 కోట్లు ఇస్తామని మాటిచ్చారు. దీంతో అంతా సెట్ అయిపోతుందని భావించిన యామినికి నిరాశ ఎదురైంది. నేరగాళ్లు ఓ ఫేక్ ఆన్ లైన్ ఖాతా ఓపెన్ చేసి ఆమెకు మూడున్నర కోట్ల రూపాయలను వేసినట్లు సమాచారం ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకోవాలంటే మరికొంత ఎమౌంట్ పే చేయాలన్నారు. ఆమె నుంచి పలు దఫాలుగా రూ.16 లక్షల వరకు రాబట్టారు.

మోసగాళ్లు సృష్టించిన ఆన్ లైన్ అకౌంట్ లో రూ.3 కోట్ల మొత్తం కనిపిస్తుండడంతో ఇంకేమీ ఆలోచించకుండా వారు అడిగినంత మొత్తాన్ని చెల్లించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ దాదాపు పదహారు లక్షల రూపాయలు వసూలు చేశారు. దీంతో ఆ యువతికి అనుమానం వచ్చింది. తాను కిడ్నీ ఇవ్వబోనని, తన డబ్బు రిటన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక డాక్టర్ ప్రవీణ్ రాజ్ పేరిట పరిచయం చేసుకున్న మోసగాడు, ఆమెను ఢిల్లీ రావాలని చెప్పి ఓ అడ్రస్ కూడా ఇచ్చారు. అక్కడి వెళ్లి చూస్తే అలాంటి హాస్పిటల్ లేనేలేదు. అప్పుడు మోసపోయానని గ్రహించిన యువతి, ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది.

అయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో అయోమయంలో మిన్నకుండి పోయింది. ఇక డబ్బు ఎం చేసావంటూ యామినిపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో చివరికి జరిగిన మోసన్ని తల్లిదండ్రులతో చెప్పింది. తల్లిదండ్రులు యామినిని తీసుకొని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇటువంటి ఘటనలు జరుగుతున్న తరుణంలో చదువుకున్న వారు కూడా ఇలా బోల్తా కొట్టడం పట్ల ఆశ్చర్యానికి గురవతున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఈ సైబర్ మోసంపై స్పందిస్తూ, ఆన్ లైన్ లో కనిపించే అన్ వెరిఫైడ్ లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి: