Last Updated:

Wives Did Third marriage to Husband: భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు .. ఎక్కడో తెలుసా?

కట్టుకున్న భర్త మరో మహిళతో చనువుగా ఉంటేనే ఇల్లాలు తట్టుకోలేదు. అటువంటిది భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే దగ్గరుండి చేయించడం చిన్న విషయం కాదు.

Wives Did Third marriage to  Husband: భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు .. ఎక్కడో తెలుసా?

Wives Did Third marriage to Husband: కట్టుకున్న భర్త మరో మహిళతో చనువుగా ఉంటేనే ఇల్లాలు తట్టుకోలేదు. అటువంటిది భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే దగ్గరుండి చేయించడం చిన్న విషయం కాదు. అది కూడ ఇద్దరు భార్యలు ఉండి మూడో మనువు కోరుకున్న భర్త కోరికను ఇద్దరు భార్యలు తీర్చడం అంటే విశేషమే. అల్లూరి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాగేని పండన్న.. పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు. అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా ఆ ఇద్దరు భార్యలు, భర్తను చక్కగా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పండన్న లక్ష్మి అనే యువతిపై మనసుపారేసుకున్నారు.

ఇద్దరు భార్యలతో రాయబారం..(Wives Did Third marriage to Husband)

జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామానికి చెందిన లక్ష్మిని ఇష్టపడ్డానని.. తనను ఎంతగానో ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు పండన్న. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు. దీంతో పండన్న ఇక వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకొని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే.. ఆ ఇద్దరు భార్యలతో రాయభారం పంపాడు.

పెద్దలు కూడా అంగీకరించడంతో.. లక్ష్మీని పండన్నకు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. పండన్నకు తల్లిదండ్రులు లేకపోవడంతో.. మొదటి భార్య, రెండో భార్యే.. తమ భర్త మూడో వెళ్లికి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అంతే కాదు పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభ లేఖల్లో కూడా.. ఆ ఇద్దరు భార్యలే అందరిని ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు. ఇంటింటికి వెళ్లి శుభ లేఖలను పంచారు. బంధు మిత్రులను ఆహ్వానించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ.. నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన.. అంటూ ఆ ఇద్దరు భార్యలు సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ..’ అంటూ శుభ లేఖను ముద్రించి ముగించారు.జూన్ 25 ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. నవ వధువు లక్ష్మి తరపు బంధువులు, మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి గ్రాండ్‌గా పండన్న, లక్ష్మిల వివాహాన్ని జరిపించారు. సంసారం సుఖ సంతోషాలతో సాగి పోవాలని ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి: