Home / ts latest news
YS Sharmila: తెలంగాణలో మాట్లాడే హక్కు లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై పలు విమర్శలు చేశారు.
Mla Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న నేడు మరణించారు. ఇవాళ ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో సాయన్నను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.
Hyderabad Pubs: హైదరాబాద్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. పబ్ లు, ఫామ్ హౌజ్ లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఇందులో పట్టుబడ్డవారిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
TSPSC: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది వరకే రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-3 నోటిఫికేషన్ ఇది వరకే విడుదల కాగా.. దానికి సంబంధించి మరో తాజా అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 3 కి సంబంధించి ఉద్యోగాలను పెంచుతూ వెట్ నోట్ ను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది.
Minister Talasani: కాంగ్రెస్ నేత.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని కోమటిరెడ్డి వ్యాఖ్యలను మంత్రి తలసాని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ కు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆ అవసరం బీఆర్ఎస్ కు లేదని అన్నారు.
Fire Accident Hyderabad: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. పురానాపూల్ లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Kondagattu: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన కొనసాగుతుంది. కొండగట్టు ఆలయానికి వచ్చిన ఆయనకి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం.. తీర్థ ప్రసాదాలు కేసీఆర్ కు అందజేశారు.
MP Komatireddy: తెలంగాణలో వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడటం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది.
Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నేడు కొండగట్టుకు రావాల్సిన సీఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.
Etala Rajendar: శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎన్ నుండి వెళ్లిన ఈటల పేరును.. కేసీఆర్ పలుసార్లు ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.