Home / ts latest news
KF Beer: ప్రజా సమస్యలను వినడానికే ప్రజావాణి ఉంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వివరించుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి కూడా.. తన సమస్యను ప్రజావాణిలో కలెక్టర్ కు విన్నవించుకున్నాడు. కానీ ఈ సమస్య వింటే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే.
Preeti: ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ప్రీతి ఆదివారం కన్నుమూసింది. ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ అంతిమయాత్రలో వివిధ పార్టీలకు చెందిన నేతలు.. ఇతరులు పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
D Srinivas: ధర్మపురి శ్రీనివాస్ కు తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితమైన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం.. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పాలనలో అనేక పదవులను స్వీకరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ ప్రెసిడెంట్ గా ప్రజల మన్ననలు పొందారు.
Warangal: యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు అంచన వేస్తున్నారు. రాహుల్ అనే యువకుడితో రక్షిత సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. రాహుల్ తో దిగిన ఫోటోలను.. మరో యువకుడికి పంపినట్లు తెలిసింది.
Preeti Died: ప్రీతి మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రూ. 10 లక్షలతో పాటు.. మరో రూ. 20 లక్షలను ఆర్ధిక సాయం ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Preeti Brain Dead: ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుమార్తె బతుకుతుందనే ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నా.. తమ కూతురు బతుకుతుందనే ఆశలు కనిపించడం లేదని ఆయన వాపోయారు.
Nirmal: ఈ మధ్య చాలామంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతున్నారు. వయసు మళ్లిన వారికి మాత్రమే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇటీవలే గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
Hyderabad Murder: ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్‌ను హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో నేరాన్నీ అంగికరించినట్లు తెలుస్తోంది.
Heart Attack: గుండెపోటు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. అలాంటి తాజా ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అరాంఘర్ చౌరస్తా గల బస్‌స్టాప్‌లో ఒక్కసారిగా యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
Warangal Cp: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం పై వరంగల్ సీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆయన మీడియాకి వివరించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.