Home / Telugu desam party
టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ లో చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు ఆరున్నర గంటల పాటు లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఇవాళ కూడ విచారణకు రావాలని సీఐడీ కోరడంతో లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.
తెదేపా కీలక నేత నారా లోకేశ్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయాంలో 10 గంటల తర్వాత విచారణ మొదలవగా.. సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగింది. కాగా వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలునిచ్చారు. ఇందులో భాగంగా నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు అశేష జనవాహిని మధ్య పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి పెడనకు తాజాగా చేరుకున్నారు. ఆద్యంతం పవన్ కు జనసేన నేతలు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఈ మేరకు ముందుగా విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆయన అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేడు గాంధీ జయంతి సందర్భంగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సత్యమేవ జయతే పేరుతో ఈ దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయిన