Home / Telangana Politics
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఆ ఉపఎన్నికే కమ్యూనిస్టుల్లో కల్లోలం రేపుతోందా.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టుగా కమ్యూనిస్టులు ‘ఎర్ర గులాబీ’లుగా మారారా..? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 30 ఏండ్ల పాటు మునుగోడు నియోజకవర్గాన్ని శాసించిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి ఏం అయ్యింది.
తెలంగాణలో తొలిసారి అధికారం అందుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు దేనికైనా సిద్ధమేనంటోంది .... ఇందులో భాగంగా కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కాంలో జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తోంది... అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు అండగా ఉన్న మీడియా, టాలీవుడ్.. అందర్నీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘ఓరుగల్లు ప్రజలకు నమస్కారం.. ఈ గడ్డపై అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా.
హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్ మిథాలీ, నటుడు నితిన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్లో సుమారు గంట పాటు వీరిద్దరితోఆయన చర్చించారు.
తెలంగాణలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారనిఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ కాలేజీ చేపట్టనున్నారు . కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సభ అనుమతి కోసం ఈ నెల 23న అనుమతిని తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ 25 న నోటీసులు పంపించారు .
బండి సంజయ్ మూడో విడత పాద యాత్ర ముగింపు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్గా నియమితులైన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొననున్నారు.
రంగంలోకి ప్రియాంక.. భారీ బహిరంగ సభకు ప్లాన్..? | Terachatu Rajakiyam | Prime9 News
రాజాసింగ్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు | Rajasingh | Prime9 News
బండి సంజయ్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు | BJP Bandi Sanjay Prajasangrama Yarta | Prime9 News