Home / Telangana Politics
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ 27న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యాత్రలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నిరసనలో బీజేపీ నేతలపై దాడి జరిగిందని, ఆ కారణంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్‌కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
లేడీ అమితాబ్ విజయ శాంతి పాతికేళ్ల కిందటే బీజేపీలో చేరినా, ఇప్పటికీ పైకెదగలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలపలేకపోయారు. టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ సోదరిగా పిలిపించుకున్నా, అక్కడా కుదురుకోలేకపోయారు.
కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సాల్ నియమితులయ్యారు. తరుణ్ చుగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం సునీల్ బన్సాల్‌ను నియమించింది. ప్రస్తుతం సునీల్ బన్సాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరొక వికెట్ పడింది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి (Vijayareddy) చేరికపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు.