Home / Supreme Court
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా భద్రతా ఉల్లంఘనకు ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ఫీ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ కోరుతూ "లాయర్స్ వాయిస్" అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
పెగాసస్ స్నూప్‌గేట్ వివాదానికి సంబంధించి సాంకేతిక కమిటీ పరిశీలించిన 29 మొబైల్ పరికరాల్లో దేనిలోనూ రుజువు కనుగొనబడలేదని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం దీని పై పలు పిటిషన్లను విచారించింది.
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్‌లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు సోమవారం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) రాజ్యాంగాన్నిసవరించాలని, ఒక వారంలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిమ్ మహిళలకు తలాక్ ద్వారా విడాకులు ఇవ్వటాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. అయితే ఒకే సారి కాకుండా, నెలకోసారి చొప్పున మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరం కాదని తేల్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీత. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఆమె పిటిషన్లో వివరించారు.
గ్యాంగ్‌స్టర్ అబు సలేంను ముంబై బాంబు పేలుళ్ల కేసులో విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి అబ సలేం 25 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేశారు. మంబై బాంబు పేలుళ్లకు సంబంధించి నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కేంద్రప్రభుత్వం పోర్చుగల్ ప్రభుత్వానికి హామీ కూడా ఇచ్చిందని అబు సలేం గుర్తు చేశారు.
కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ఆదేశాలను దిక్కిరించారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. అయితే ఈ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు.