Home / students
TGIIC : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్శిటీ లోపల, బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే టీజీఐఐసీ కీలక ప్రకటన […]
Tenth Exams : రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో ఎగ్జామ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని అధికారులకు తెలియజేయంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన […]
10th Exams : తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. పరీక్షలకు 5 లక్షల 9 వేల 403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2,650 పరీక్షా కేంద్రాలను బోర్డు ఆఫ్ సెకండరీ స్కూల్ ఏర్పాటు చేసింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. విద్యార్థులు […]
Half Day Schools : రాష్ర్టంలో ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా ఒంటిపూట బడులపై ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని చెప్పింది. […]