Home / Samantha
టాలీవుడ్ లో ప్రముఖ కథానాయిక సమంత నటిస్తున్న తాజా చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందించబడిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టీజర్ ను రిలీజ్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇక తెలుగు ప్రజలు అయితే ఆమెను చూసి "ఏమాయచేశావే" అంటారు. "మనం" అంటూ ఆమెపై ఆత్మీయత చూపుతారు. తన అందచందాలతో నటనతో అభిమానులను టాలీవుడ్ "మజిలి"కి చేర్చిన అందాల భామ.
నటి సమంత ఇటీవల కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పూజారుల బృందం పాల్గొని ఆమెను ఆశీర్వదించారు. సమంత పూజకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో నాగ చైతన్య , సమంత కు క్రేజ్ మామూలుగా లేదు ఒక రేంజులో ఉందనే చెప్పుకోవాలి. వీళ్ళద్దరు ఒకప్పుడు తెలుగు అభిమానుల ఆల్ టైమ్ ఫేవరేట్ కపుల్ గా ఉన్నారు. వీళ్ళు ప్రేమించుకొని ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారన్నా విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వీళ్ళ జంటను చూసి ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకోవాలిసి వచ్చింది.
చాలా రోజుల నుంచి సమంతా సోషల్ మీడియాకు, ఆమె అభిమానులకు దూరంగా ఉంటుంది. కారణం ఏం అయి ఉంటుందో తెలీదు. ప్రస్తుతం సమంతా నటిస్తున్న సినిమా "యశోద" ఈ సినిమాకు హరి హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవ్వనుంది.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతా మీద ఎన్నో రుమార్లు వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఒక్క డానికి కూడా సమాధానం చెప్పకుండా తన పని తాను సంతోషంగా చేసుకుంటుంది. ఈ రుమార్లు నాకు కొత్తేమీ కాదు నాకు ఇవి కామన్ అంటూ సిల్లిగా తీసుకొని వదిలేసింది.
ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు యక్టీవ్ గా ఉండే సమంత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా అకౌంటుకు రావడం లేదు అసలు ఓపెన్ కూడా చేస్తున్నట్టు లేరు. ఈ మౌనం వెనుక కారణం ఏం ఉంది? నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతలో ఈ మార్పు వచ్చింది.
పుష్ప చిత్రంలోని ’ఊ అంటావా‘ పాట ద్వారా నటి సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఆమెను తిరిగి వెలుగులోకి తెచ్చింది. చాలా మంది నిర్మాతలు ఆమె కాల్షీట్లకోసం సంప్రదించడం ప్రారంభించారు.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి సమంత పాల్గొంది.