Home / Rakul Preet Singh
రకుల్ ప్రీత్ సింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ భామ. ప్రస్తుతం తెలుగు తమిళ మళయాల హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఈమె తన అందం అభినయంతోనే కాకుండా మల్టీటాలెంట్ స్కిల్స్ తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. గోల్ఫ్, కరాటే, భరతనాట్యం, షటిల్ ఇలా పలు రంగాల్లో ఈమెది అందెవేసిన చెయ్యి. మోడలింగ్‌లోనూ తన సత్తా చాటింది. ప్రేక్షకులు కోరిన మిస్ ఇండియాగానూ మెరిసింది ఈ బ్యూటీ
టాలీవుడ్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ రకుల్. కాగా ఈ స్టార్ హీరోయిన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. కాగా 2023లో రకుల్ పెళ్లి చేసుబోతుందంటూ ఆమె సోదరుడు అమన్ ట్వీట్ చేశాడు. దానిపై రకుల్ ఏమని స్పందించిందో చూడండి.
అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న కామెడీ చిత్రం థాంక్ గాడ్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకులముందుకు రాబోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.