Last Updated:

రకుల్ ప్రీత్ సింగ్: డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు ఈడీ నోటీసులు

బెంగళూరు డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చారు.

రకుల్ ప్రీత్ సింగ్: డ్రగ్స్ కేసులో నటి రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు ఈడీ నోటీసులు

Rakul Preeth Singh: బెంగళూరు డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కేసును సవాల్ గా తీసుకున్న అక్కడి పోలీసులు ఓ నైజీరియన్ ని అరెస్ట్ చేయగా, పలు లింకులు బయటపడ్డాయి. ఇప్పటికే నిర్మాత శంకర గౌడను పోలీసులు విచారించారు. నోటీసులు అందాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అంగీకరించారు. అందులో ఏముందో తానింకా చూడలేదని, ఈడీ చెప్పిన రోజున విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

మొయినాబాద్ ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. బెంగుళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల పదే పదే చెబుతున్నారు. ఈ తరుణంలో పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: కర్నూలులో తోటికోడళ్ల హత్య… హంతకులను పట్టించిన చెప్పు… ఎలాగంటే…

ఇవి కూడా చదవండి: