Home / Pawan Kalyan
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దమ్ముంటే పవన్‌ను 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నిన్న సభలో స్టీల్‌ప్లాంట్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు.
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాల గురించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నానని రేణూ దేశాయ్ చెప్పారు. తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని రేణూ దేశాయ్ తెలిపారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుండి మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడత కూడా అంతకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 14న తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి జంక్షన్ వద్ద వారాహి యాత్ర తొలి విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గద్దర్ మృతిపట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది బాధాకరమైన రోజు అని.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా గద్దర్ పని చేశారని, యువతను ఉద్యమం వైపుకు ప్రేరేపించడంలో గద్దర్ పాత్ర ఉందన్నారు.
గన్నవరం నియోజకవర్గం, మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీకోసం ప్రత్యక్ష ప్రసారం..
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 10వ తేదీ నుంచి విశాఖ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. యాత్రలో భాగంగా 6 ఫీల్డ్ విజిట్స్ , 2 బహిరంగ సభలు, ఒక జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇతర విభాగాలు, దస్త్రాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించారు. పవన్‌కల్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని పార్టీ వర్గాలు
ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు బయపడ్డాయని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ఏపీలో 47 పాయింట్ ఒకటి ఏడు టన్నుల బంగారు నిక్షేపాలున్నాయని ప్రహ్లాద్ జోషి చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ సెటైర్లు వేసారు.