Home / Nara Lokesh
రాజమండ్రిలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ఖరారు చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖత్ సందర్బంగా పలు కీలక అంశాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావించారు. కాసేపట్లో జరగబోయే జనసేన- టిడిపి జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో చర్చించబోయే అంశాలని చంద్రబాబుకి లోకేష్ వివరించారు.
రాజమండ్రిలో రేపు జనసేన టీడీపీసమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్లో ఏర్పాట్లను ఉమ్మడి తూ.గో. జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపి నేత ఆదిరెడ్డి వాసు , జనసేన రాజమండ్రి ఇంఛార్జి అత్తి సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ చేరుకోనున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.
ప్రజల కోసం టీడీపీ నేతలు నిత్యం పోరాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. ఐదేళ్లుగా టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజెక్టులను సందర్శించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో పార్టీ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. దీంతో పార్టీలో పునరుత్తేజం నింపేందుకు టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ యాత్రలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ లో చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాని నారా లోకేష్ కలిశారు. జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ అమిత్ షాకు వివరించారు.
ఏపీలో 175 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఇంట్లో నేడు వైసీపీ నాయకులు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.