Home / Munugode
మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ రాజకీయపార్టీలన్నీ మునుగోడుపై ఫుల్ ఫోకస్ చేశాయి. ప్రధాన పార్టీలకు అక్కడ గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
ఈ ఏడాది చివరిలో జరగనున్న మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక నేపధ్యంలో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఒక పార్టీ మీద ఒకరు ఆరోపణలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఉపఎన్నిక పోరుకు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలీకున్నా.. నియోజకవర్గంలో పరిస్థితులు రాజకీయ పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఉప పోరులో అధికార పార్టీ అభ్యర్థిగా పలువురి పేర్లు వినిపిస్తున్న వేళ.. తాజాగా మాజీ ఎంపీ.. కేసీఆర్ కు సన్నిహితుడైన బూర నర్సయ్య గౌడ్ రేసులోకి వచ్చేసిన వైనం కలకలంగా మారింది.
మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల పై మండిపడుతూ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిపి గొయ్యి తీసి దానిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
మునుగోడులో కొద్ది రోజులుగా స్థబ్దతుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. నేతలంతా ఒక భావోద్వేగ పూరిత వాతావరణంతో ఒక్కతాటి పైకి వస్తున్నారు. అగ్రనేత రాహుల్‌గాంధీని స్ఫూర్తిగా తీసుకుని మునుగోడు సిట్టింగ్ స్థానం పై కాంగ్రెస్ జెండా
మునుగోడులో కాంగ్రెస్ శ్రేణుల మద్దతుకోసం ఆమె ముప్ప తిప్పలు పడుతున్నారంట రాజగోపాల్ రాజీనామాలో బైపోల్స్ అనివార్యమైన మునుగోడు సిట్టింగు సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదంటూ బిజెపి శాసనసభ్యులు ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు
కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక అంటేనే ఓటుకు భారీ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని రాజకీయ పార్టీలకు ప్రతి ఓటు కీలకమే కావడంతో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ మునుగోడు నియోజకవర్గంలో ఊపందుకుంది.
మునుగోడులో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారపర్వాన్ని మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే ఓ ఎంపీటీసీ సభ్యురాలి భర్త చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో దుమారం రేపాయి.