Home / MLC Kavitha
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ట్రయల్ మాత్రమే.. అసలు కథ ముందుంది అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. నిన్న కేసీఆర్ కూతురు కవితను సీబీఐ సుదీర్ఘ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆ విచారణ అనంతరం కూడా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా ముగియలేదని పేర్కొంటూ సీబీఐ అధికారులు మరోసారి కవితకు సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చారు.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు చేరుకున్న సీబీఐ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఇటీవలె కాలంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజురోజుకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో కవిత మీడియా ముందుకు వచ్చారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అజ్మీర్‌లోని ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గానుసందర్శించి చాదర్‌ను సమర్పించారు.
సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ సారి చంచల్ గూడ లేదా తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతారని మునుగోడు ఉపఎన్నిక భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు
యావత్తు దేశంలో పెద్ద చర్చకు దారితీసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ గా మారుస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీగా జీవం పోసుకొన్న కీలక తరుణంలో మరో వాదం తెరపైకి వచ్చింది. సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అవిష్కరణ సమయంలో ఆమె గైర్హాజరుపై సర్వత్రా చర్చకు దారితీసింది. నెట్టింట ఎందుకు పాల్గొనలేదనంటూ విభన కధనాలను వ్యాపిస్తున్నారు.
రంగారెడ్డి కోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె కోర్టుకు వచ్చారు. అయితే కవితను న్యాయవాదులు అడ్డుకొన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, కోర్టుకు ఎలా వస్తారని కవితను నిలదీసారు.
దేశ రాజధానిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఏర్పడింది. ఇండియా గేట్ వద్ద అధికారికంగా బతుకమ్మ సంబరాలను చేపట్టారు. సంబరాలను వీక్షించేందుకు సాంస్కృతిక శాఖ ఎల్ ఇ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆహ్లాద వాతావరణాన్ని మరింత దగ్గర చేసింది