Home / Manipur
Manipur Violence is peace possible again: గత రెండేళ్లుగా జాతుల వైరంతో అట్టుడికిన మణిపూర్‌లో గత నెల రోజుల వ్యవధిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మణిపూర్ హింసను అడ్డుకోవటంలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇదిలా ఉండగానే రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ నెల తొమ్మిదవ తేదీన తన పదవికి రాజీనామా చేయటంతో […]
President’s Rule Imposed in Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీలు, మైతీల మధ్య హింస చెలరేగటంతో, అదింకా కొనసాగటంతో గత రెండేళ్లుగా బీరేన్ సింగ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘర్షణల్లో వందల మంది […]
Manipur CM Biren Singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందించారు. కొంతకాలంగా మణిపుర్లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షాను కలిసిన అనంతరం మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్.. నేరుగా తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ […]
Nitish Kumar’s JDU withdraws support for BJP-ruled Manipur: మణిపూర్‌లో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం బుధవారమంతా వార్తల్లో నిలిచింది. మణిపుర్‌లోని బీజేపీ సర్కార్‌కు షాక్ ఇస్తూ ఆ ప్రభుత్వానికి నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకున్నారనే వార్తలు రోజంతా చర్చలకు దారితీశాయి. దీంతో కేంద్రంలోనూ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారని మీడియా వాళ్లు చర్చలతో ఊదరగొట్టారు. అయితే, తీరా అసలు సంగతి తెలుసుకుని ‘ఇంతేనా’ అనుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ జరిగింది.. మణిపుర్‌లోని […]
Manipur attacking Army camp: మణిపుర్లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడులకు తెగబడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు కొందరు గాయపడ్డారు. జకురాడోర్ కరోంగ్‌లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. […]
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, ఆర్ మహదేవన్‌లను రాష్ట్రపతి నియమించారు. వీరి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 కు చేరింది.
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పవర్ స్టేషన్ నుంచి భారీ ఇంధనం లీకై దాని పక్కనే ప్రవహించే వాగుల్లో కలిసింది. కొన్ని చోట్ల వాగుల్లో మంటలు రేగడంతో స్దానికులు ఆందోళనకు గురయ్యారు. కాంటో సబల్, సెక్మాయి వంటి గ్రామాల మీదుగా వెళ్లే వాగుల్లో ఇంధనం కలిసిందని వారు తెలిపారు. దీనితో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో రెండు గ్రూపుల ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. అనంతరం అస్సాం రైఫిల్స్ ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించనపుడు తెంగ్నౌపాల్ జిల్లాలో వీరి మృతదేహాలను కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది.
మణిపూర్ ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 5 వరకు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. హోం శాఖ మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని వారంలోపు రెండుసార్లు పొడిగించడం గమనార్హం.హానికరమైన సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. శాంతి భద్రతలు మరియు హింసకు అవకాశం ఉన్నందున ఇంటర్నెట్ నిషేధాన్ని అక్టోబర్ 26 వరకు పొడిగిస్తూ రాష్ట్ర పోలీసులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.