Home / Mallikarjun Kharge
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని 'విష సర్పంగా అభివర్ణించారు. తరువాత ఖర్గే తన ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ కి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఆయన డిప్యూటీ తేజస్వి యాదవ్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు రాహుల్ గాంధీతో సమావేశమై సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజస్థాన్‌లో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళకు దిగారు.
మరమ్మత్తులు చేసిన 5రోజుల్లోనే పురాతన వంతెన కూలిపోవడం పై మాజీ సుప్రీకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం; థరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించి, రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీయేతర అధ్యక్షుడిగా అవతరించేందుకు మార్గం సుగమం చేశారు.
ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా జరుగుతుంటే .. మరోవైపు అదే స్థాయిలో ఈ నేల 17 వ తేదిన జరిగే ఏఐసీసీ ఎన్నికల పైనే అందరిదృష్టీ ఉంది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.