Home / latest Telangana news
అదిలాబాద్ రిమ్స్‌లో రాత్రి వైద్య విద్యార్థులను బయటి వ్యక్తులు వచ్చి కొట్టడాన్ని నిరసిస్తూ రిమ్స్ విద్యార్థులు ప్రధాన గేట్ ముందర ధర్నాకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ దిష్టి బొమ్మను విద్యార్థులు దహనం చేశారు. తమ వార్డుల్లో సరైన సదుపాయాలు లేవని నిన్న సాయంత్రం డైరెక్టర్‌తో గట్టిగా మాట్లాడితే ఇలా రౌడీలను తీసుకువచ్చి దాడులు చేపియిస్తారా అని బాధితుడు కవిరాజు నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబసమేతంగా గురువారం తెల్లవారు జామున గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాలతో ఆర్థిక, ఇంధన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
భూములకి సంబంధించిన ధరణి పోర్టల్‌పై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధరణి యాప్ భద్రతపై సిఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆరా తీశారు. ధరణిలో ఉన్న లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్‌ని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33, 34, 35 సర్వ్ నెంబర్ లోగల 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ స్పీకర్ పదవికి మరి కాంగ్రెస్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఎన్నికకి సహకరించాలని ప్రతిపక్ష బిఆర్ఎస్ నిర్ణయించింది. ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సైతం కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
పది రోజుల వరకు తనను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను కోరారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యం కలుగుతుందని అందువలన ఎవరూ తనను పరామర్శించేందుకు రావద్దని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేసారు.
: తెలంగాణలో ఐపిఎస్‌ల బదిలీలు మొదలయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబుని నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సైబరాబాద్ కమిషనర్‌గా అవినాష్ మహంతిని నియమించారు.
టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డిని 2021లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నియమించింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు.
తెలంగాణ మూడో శాసనసభ కొలువుదీరింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.