Home / latest Telangana news
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో పుట్టినరోజు ఘనంగా జరిగాయి. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మొదటిసారి రేవంత్ రెడ్డి గాంధీభవన్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సోనియా గాంధీకి 78 వ పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 78 కిలోల కేక్ కట్ చేశారు.
తెలంగాణ మంత్రులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఈ నెల 7వ తేదీన తెలంగాణ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా రెండు రోజులుగా శాఖలు కేటాయించలేదు.
మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫ్రీ బస్సు జర్నీ స్కీం విధివిధానాలు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నుంచి తెలంగాణ మహిళలు, ఆడపిల్లలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం చేయనున్నారు. జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో, సిటీలో ఆార్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీనిఎంపిక చేశారు. ఇప్పటి వరకూ అక్బరుద్దీన్ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేపు జరగబోయే అసెంబ్లీలో ఆయన కొత్త గా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
హైదరాబాద్ జ్యోతిరావు పులే భవన్ ( ప్రగతి భవన్ )లో ప్రజా దర్భార్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుని ఆయా శాఖల అధికారులకు పంపించి.. పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం తొలిసారి సచివాలయానికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు సచివాలయం చేరుకున్నారు. రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పండితుల ఆశీర్వచనం అందించారు.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ ప్రారంభమయింది.
తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాలే పునాదిగా ఏర్పడిన రాష్ట్రమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రమంతా సమానమైన అభివృద్ది చేయాలన్న సోనియా గాంధీ సంకల్పంతో తెలంగాణ ఏర్పడింది. కాని దశాబ్దకాలం మానవహక్కులకు చోటు లేకుండా పోయిందన్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.రేవంత్ రెడ్డితో పాటు మిగతా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.
: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.