Home / latest international news
ఈ పేలుడుపై అధికారులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. డెయిరీ ఫామ్ లోని మిషన్స్ బాగా వేడెక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఉత్తర కొరియాలో అధ్వాన్నంగా ఉన్న ఆర్థిక పరిస్థితి దాని పౌరులపై, ముఖ్యంగా శ్రామిక వర్గంపై పడుతోంది. కొంచెం సులభంగా మరియు త్వరగా డబ్బు సంపాదించడానికి, దేశంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఉపకరణాలు, విడిభాగాలు మరియు ఇతర వస్తువులను దొంగిలించడం ప్రారంభించారు
: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదిక ప్రకారం, మార్చి మధ్యలో చైనాలో H3N8 బర్డ్ ఫ్లూ యొక్క మొదటి కేసు నమోదయింది. 56 ఏళ్ల మహిళ పక్షులలో కనిపించే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా యొక్కవ్యాధి బారిన పడి చైనాలో మరణించిన మొదటి వ్యక్తి కావడం గమనార్హం.
మయన్మార్ పాలక జుంటా ప్రభుత్వం మంగళవారం ఒక గ్రామంపై వైమానిక దాడిని నిర్వహించినట్లు ధృవీకరించింది, ఇందులో చాలా మంది పిల్లలు మరియు విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు.
జంతువులు కూడా ఆల్కహాల్ వ్యసనానికి గురవుతాయా? అంటే అవుననే చెప్పాలి. యూకే లోని డెవాన్లోని వుడ్‌సైడ్ యానిమల్ రెస్క్యూ ట్రస్ట్, కోకో అనే కుక్క మద్యానికి బానిసైన వింత కేసును చూసింది.
'జీరో-కోవిడ్' విధానంలో ఆకస్మిక సడలింపు నేపధ్యంలో మూడేళ్ల తర్వాత చైనాలో సరిహద్దు ప్రయాణాన్ని పూర్తిగా పునరుద్ధరించడం దేశంలోని యువతకు వరంగా మారుతోంది. చైనీస్ ఎయిర్‌లైన్స్ తమ అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. దీనితో క్యాబిన్ క్రూ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం భారతదేశంలోని ముస్లింల స్థితిని సమర్థించారు. నిజంగా వారి పరిస్దితి బాగోకుంటే వారి జనాభా పెరగదని అన్నారు. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (PIIE)లో భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు వృద్ధిపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ సోమవారం మాట్లాడారు.
ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్ తాజాగా బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీకి ప్రభుత్వం ఫండింగ్ సమకూరుస్తోందని తన ప్రొఫైల్ పేజీలో వివరించింది. ఈ ట్వీట్ వెల్లడైన వెనువెంటనే ట్విట్టర్ లేబుల్‌పై బీబీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మస్క్‌కు గట్టిగానే జవాబిచ్చింది. ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారి నుంచి లైసెన్సు రుసుము తీసుకుని మీడియా సంస్థను నడిపిస్తున్నామని వివరణ ఇచ్చింది.
: కోవిడ్-19 వైరస్ వుహాన్ మార్కెట్లో జంతువుల నుండి మనుషులకు దూకిందనే సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ మానవులలో పుట్టి ఉండవచ్చని చైనా శాస్త్రవేత్త ఒకరు పేర్కొన్నారు. బీజింగ్ యూనివర్శిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన టోంగ్ యిగాంగ్ మాట్లాడుతూ, వుహాన్‌లోని హువానాన్ సీఫుడ్ మార్కెట్ నుండి తీసిన వైరల్ నమూనాల జన్యు శ్రేణులు కోవిడ్ సోకిన రోగులతో దాదాపు ఒకేలా ఉన్నాయని, తద్వారా మానవుల నుండి కోవిడ్ ఉద్భవించి ఉండవచ్చని సూచించారు.
కొందరు ఖరీదైన కార్లు కొనాలనే ఆసక్తితో ఉండటమే కాకుండా తమ కారు నంబర్ ప్లేట్ కోసం కోట్లలో చెల్లించేందుకు కూడా సిద్ధపడతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు నంబర్ ప్లేట్‌ను రూ.122 కోట్లకు విక్రయించి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఘటన శనివారం చోటుచేసుకుంది.