Home / latest international news
ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, రహస్య కెమెరాలో ఆ చర్యలను చిత్రీకరించినట్లు నిర్ధారించారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.
పాకిస్థాన్‌లో జంట పేలుళ్ళ వ్యవహారం కలకాలం సృష్టించింది. సోమవారం రాత్రి వాయవ్య పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) పోలీస్ స్టేషన్ పై జరిగిన ఈ జంట పేలుళ్లలో 13 మంది మరణించారు. సుమారు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
చైనా సరిహద్దు వెంబడి తన రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం మరియు సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన భారతదేశం, 2022లో మిలటరీకి ఖర్చు పెట్టిన దేశాల్లో 4వ స్దానంలో నిలిచింది. సౌదీ అరేబియా ఐదో స్థానంలో నిలిచింది
సూడాన్‌లో కొనసాగుతున్న ఘర్షణల్లో 400 మందికి పైగా మరణించగా 3,351 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దేశ సైన్యం మరియు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా ఇతర దేశాలకు చెందిన పలువురు చిక్కుకు పోయారు. వీరిని అక్కడనుంచి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్తామని నమ్మిన క్రైస్తవ మతానికి చెందిన వారిగా భావిస్తున్న 51మంది మృతదేహాలను కెన్యా పోలీసులు వెలికితీశారు.తీర ప్రాంత పట్టణం మలిండి సమీపంలో పోలీసులు శుక్రవారం షాకహోలా అటవీప్రాంతం నుండి మృతదేహాలను వెలికి తీయడం ప్రారంభించారు
కాగా జీ20 సమ్మిట్ లో భాగంగా బైడెన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఆయన తో పాటు అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో
యెమన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని సనాలోని ఓల్డ్ సిటీలో రంజాన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. అరేబియా ద్వీప కల్పంలోనే అత్యంత పేద దేశంగా యెమెన్ ఉంది. ఈదుల్ ఫితర్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఓ చారిటీ పంపిణీ కార్యక్రమంలో
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యోధులు ఆదివారం సిరియాలో కనీసం 36 మంది ట్రఫుల్ వేటగాళ్లు మరియు ఐదుగురు గొర్రెల కాపరులను చంపారు.బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్‌కు చెందిన రామి అబ్దెల్ రెహ్మాన్ మాట్లాడుతూ జిహాదిస్ట్ గ్రూప్ ఆదివారం (మధ్య నగరం) హమాకు తూర్పున ఎడారిలో ట్రఫుల్స్ సేకరిస్తున్నప్పుడు 36 మందిని చంపారని తెలిపారు.
ఉత్తర బుర్కినా ఫాసోలో సైన్యం మరియు స్వచ్ఛంద రక్షణ దళాలపై గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు జరిపిన దాడిలో 40 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారని అధికారులు ఆదివారం తెలిపారు.
దుబాయ్‌లోని అపార్ట్మెంట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి కనీసం 16 మంది మరణించగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన అల్ రాస్ ప్రాంతం దుబాయ్ క్రీక్ సమీపంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన దుబాయ్ స్పైస్ మార్కెట్‌ను కూడా కలిగి ఉంది.