Home / latest ap politics
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ తుది శ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున తిరుపతిలోని ఆమె నివాసంలో ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా కుతూహలమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలని విమర్శిస్తుండడంతో వైసీపీ - జనసేన, తెదేపా పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.వీటికి మరింత ఊతాన్ని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వర్సెస్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం రాష్ట్రంలో మరింత హీట్ పుట్టిస్తుంది.
తెలుగు దేశం పార్టీ పై వైఎస్సీర్సీపీ నేత లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదన్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన చెందటం చూస్తుంటే ఏపీలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Nellore YCP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద దుమారమే లేపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభుత్వం ట్యాంపరింగ్ చేస్తోందని కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే . తన ఫోన్ ట్యాంపింగ్ చేశారని.. అందుకు తగ్గ సాక్ష్యాలు సైతం ఆయన బయటపెట్టారు. చంపేందుకు కుట్ర: ఆనం మరో వైపు తన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన మరో […]
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. తాజాగా నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..