Home / Jasprit Bumrah
ఇటీవల కాలంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లలో బుమ్రా కనిపించకపోవడం చూసాము. అయితే గాయం అయిన కారణంగా ఆసియా కప్ కు దూరమైన టీమ్ఇండియా సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
లార్డ్స్ వేదికగా నేటి సాయంత్రం 5 గంటలకు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని బావిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన భారత్... ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.
టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ భరతం పట్టారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్