Home / Indrakeeladri
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగా నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజే భక్తులకు ఆలయంలో అసౌక్యం ఏర్పడింది. దుర్గగుడిలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ లేకపోవడం వల్ల భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేదీతో ముగుస్తాయి.