Home / floods
నైరుతి చైనాలోని పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా కనీసం 15 మంది మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, 31 మిలియన్ల విస్తారమైన పర్వత ప్రాంతమైన చాంగ్కింగ్లో మధ్యాహ్నానికి మరో నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు తెలిసింది.
ఉత్తర మరియు పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ నిర్వహణలోని రువాండా బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీ (ఆర్బీఏ) తెలిపింది.నిన్న రాత్రి కురిసిన వర్షం ఉత్తర మరియు పశ్చిమ ప్రావిన్స్‌లలో విపత్తుకు కారణమైందని ఆర్బీఏ తన వెబ్సైట్లో తెలిపింది.
కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన విస్తృత వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం సుమారుగా 100 మంది మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.
ఓవైపు అతాకుతలం. మరో వైపు హ్యపీ ఈటింగ్. ఇంకేముంది ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం వెల్లుబికింది. అంతే సోషల్ మీడియా వేదికగా అందుకు కారణమైన వ్యవహారం పై నెటిజన్లు దుమ్ము దులిపేసారు.
భారతదేశం సిలికాన్ వ్యాలీ గా పేరుగాంచిన బెంగళూరు నగరం దేశంలోని ప్రముఖ సమాచార సాంకేతిక ఎగుమతిదారుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరం, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలమయింది.
భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే వేదవతి నదిగత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పొంగి పొర్లుతోంది. ఈ నది పై కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా దశాబ్దాలుగా నీరు అడుగంటింది.
బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తడంతో పడవలను మోహరించారు. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్‌ఫీల్డ్ మరియు బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరదకు ప్రభావితమయ్యాయి.
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలమయింది. ప్రజలను ఖాళీ చేయడానికి తెప్పలను పంపమని అధికారులను ప్రేరేపించారు. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు బిఈఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా వరదనీటిలో చిక్కుకున్నాయి.