China Floods: చైనాలోని బీజింగ్ సమీపంలో వరదలతో 11 మంది మృతి.. 27 మంది గల్లంతు.
:చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల పర్వత ప్రాంతాలలో వరదల కారణంగా 11 మంది మరణించగా, 27 మంది తప్పిపోయారు.నాల్గవ రోజు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలప్రజలను పాఠశాల జిమ్‌లకు తరలించాలని అధికారులు ఆదేశించారు

China Floods:చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల పర్వత ప్రాంతాలలో వరదల కారణంగా 11 మంది మరణించగా, 27 మంది తప్పిపోయారు.నాల్గవ రోజు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలప్రజలను పాఠశాల జిమ్‌లకు తరలించాలని అధికారులు ఆదేశించారు. రైల్వే స్టేషన్లను కూడా మూసివేసారు.ప్రజల ఇళ్లలోకి వరదలు వచ్చాయి. రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరదలు..(China Floods)
సాధారణంగా ఒక మోస్తరు, పొడి వాతావరణాన్ని అనుభవించే బీజింగ్ అసాధారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఉత్తర చైనాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తున్న వరదల కారణంగా అనేక మరణాలు నమోదయ్యాయి.చైనాలోని పెద్ద ప్రాంతాలు ప్రతి వేసవిలో కాలానుగుణ వరదలకు గురవుతాయి. అయితే కొన్ని ఉత్తర ప్రాంతాలు ఈ సంవత్సరం 50 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత ఘోరమైన వరదలతో ప్రభావితమయ్యాయి.జూలై ప్రారంభంలో, చాంగ్‌కింగ్‌లోని నైరుతి ప్రాంతంలోని వరదలు కనీసం 15 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 5,500 మందికి పైగా ప్రజలు సుదూర వాయువ్య ప్రావిన్స్ లియానింగ్‌లో ఖాళీ చేయవలసి వచ్చింది.వర్షపు తుఫానుల కారణంగా సెంట్రల్ ప్రావిన్స్ హుబెయ్‌లోని నివాసితులు వారి వాహనాలు మరియు ఇళ్లలో చిక్కుకున్నారు.
1998లో చరిత్రలోనే మొదటిసారిగా వరదలతో చైనా భారీ విధ్వంసానికి గురయింది. ఇందులో 150 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో ఎక్కువ మంది యాంగ్జీ నది వెంట ఉన్నారు.2021లో సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్‌లో వరదల కారణంగా 300 మందికి పైగా మరణించారు.రికార్డు స్థాయిలో వర్షపాతం ఆ సంవత్సరం జూలై 20న ప్రావిన్షియల్ రాజధాని జెంగ్‌జౌను ముంచెత్తింది.
ఇవి కూడా చదవండి:
- Maharashtra Girder Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ కూలి 17 మంది మృతి
- ED Raids : హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు