Home / Congress
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని, తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి మరికాసేపట్లో ఈడీ ముందుకు హాజరు కానున్నారు. గత నెలలో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వెళ్లలేక పోయారు. దాంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని 5 రోజులు విచారించిన ఈడీ, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క తడబాటుకు గురయ్యారు. ఒకరికి ఓటు వేయబోయి మరొకరికి ఓటు వేశారు. ఆనక పొరపాటయింది. మరో బ్యాలెట్ పేపరు అడగటంతో పోలింగ్ అధికారులు నిరాకరించారు. దీంతో సీతక్క వెళ్లిపోయారు. అయితే తను ఓటు వేసే విషయంలో తాను సిద్ధాంతాలకు కట్టుబడే ఉన్నానని అయితే మరో అభ్యర్థి పేరు దగ్గర పెన్ మార్క్ పడిందని,
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాగాంధీకి తాజాగా సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న హాజరు కావాలని నోటీసులో కోరింది. కాగా ఈడీ సోనియాకు గాంధీకి ఇచ్చిన నాలుగు వారాల గడువు ఈ నెల 22తో ముగియనుంది. ఇదిలా ఉండగా గత నెలలో ఈడీ జారీ చేసిన సమన్లను కొంత కాలం పాటు వాయిదా వేయాలని సోనియా కోరారు.