Home / Congress Party
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియ జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల, అతను రాబోయే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన పౌర సమాజానికి చెందిన సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ,
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన కొన్ని పోస్టర్ల కలకలం రేపుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. చండూరు సభలో తనను అసభ్యకరంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా సోకింది. ప్రియాంక గాంధీకి కరోనా సోకడం ఇది రెండోసారి. ఆమె ఐసోలేషన్‌లో వున్నారు. తనకు కరోనా వైరస్ సోకిందని ప్రియాంక గాంధీ ట్వీట్ ద్వారా సమాచారం అందించారు. ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, "ఈ రోజు మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాను.
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కొమటిరెడ్డి బద్రర్స్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎలాగైన మునుగోడును గెలుచుకోవాలని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శతాబ్దం క్రితం ఒక్కో ఇటుక పేర్చుకుంటూ భారత్‌ను నిర్మించుకుంటే ప్రస్తుతం మన కళ్ల ముందే ప్రజాస్వామ్యం నాశనంమవుతోందని
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరొక వికెట్ పడింది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి (Vijayareddy) చేరికపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.