Home / CM Revanth Reddy
CM Revanth Reddy Comments on kcr in Nizamabad: రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించినా ఇంకా మార్పు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను ప్రజలు […]
CM Revanth Reddy Unveils Yadagirigutta Temple Golden Vimana Gopuram: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా బంగారు గోపురాన్ని సీఎం ఆవిష్కరించారు. స్వర్ణతాపడం కోసం రూ.80కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.80కోట్లతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి ఈ స్వర్ణతాపడాన్ని […]
CM Revanth Reddy to lay Foundation for Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పనులకు శుక్రవారం మొదటి అడుగు పడనుంది. ఈ మేరకు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాలోని ని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో భాగంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. కాంగ్రెస్ సర్కార్ మంజూరు చేసిన ఇళ్ల పనులకు […]
CM Revanth Reddy Attends Investigation in Nampally Court: సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, హైదరాబాద్‌లోని బేగం బజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలపూర్‌తోపాటు నల్లగొండ టూటౌన్లో మొత్తం తొమ్మిది కేసులు రేవంత్‌పై నమోదయ్యాయి. కేసు విచారణను ఈ నెల 23కి […]
CM Revanth Reddy Attends Cyber Security Conclave-2025 at HICC: సైబర్ భద్రతలో దేశంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025కు ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డితో కలసి సీఎం రేవంత్ పాల్గొన్నారు. సైబర్ నేరాలు నేడు వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థల స్థాయికి పెరగటం మీద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను […]
Indiramma Houses For Beneficiaries: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలోని వారికి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్ 1 సొంత స్థలం ఉన్నా వారు, ఎల్2 స్థలం లేనివారు, ఎల్3 ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నావారుగా విభజించింది. […]
CM Revanth Reddy Announced Free Sand To Indiramma Houses Scheme: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, రీచ్‌లలో తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు […]
CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రాలపై మోదీ కుట్రలు ఒకే […]
CM Revanth Reddy Key Comments in CLP Meeting: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సీఎల్పీ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కులగణన, వర్గీకరణపై చర్చ.. ఇటీవల ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలు, నిర్ణయాలతోపాటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, స్థానిక సంస్థల […]
CM Revanth Reddy Introduced Caste Census Servey in Telangana Assembly Session: కులగణన, ఎస్సీ వర్గీవరణ నివేదికలపై తీర్మానానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ రెండు నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ మేరకు కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేపట్టామని, రాష్ట్ర […]