Home / BJP
సీనియర్ నటి గౌతమి బీజేపీని వీడారు.తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను గత 25 సంవత్సరాలుగా బీజేపీలో సభ్యురాలిగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కాగా నిన్ననే తెలంగాణలో ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో తెలంగాణలో చేపట్టాలని సన్నాహాలు చేస్తున్న బీజేపీ.. ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు వరుస పర్యటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. భాజపా నేత డికె అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ పార్టీలో చేరగా.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయనకు కండువా కప్పారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రవీణ్ జాయిన్ కావడాన్ని పార్టీలో ఒక వర్గం వ్యతిరేకించింది.
ప్రధాని మోదీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం. ఈ వరుస పర్యటనల నేపధ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల (సెప్టెంబర్ 18 - సెప్టెంబర్ 22) పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో 75 ఏళ్ల ప్రస్థానంతో పాటు, సాధించిన విజయాలు, అనుభవాలపై తొలి రోజు చర్చతో.. ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు సభకు హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం లోక్‌సభలోని తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ముఖ్యమైన శాసనసభ వ్యవహారాలను చర్చించడానికి మరియు ప్రభుత్వ వైఖరికి మద్దతు ఇవ్వడానికి హాజరు కావాలని బీజేపీ తన ఎంపీలను కోరింది.
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.సెప్టెంబర్ 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు.
సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు. ఈ సారి అతను బీజేపీని టార్గెట్ చేసారు. బీజేపీని విషపూరిత పాము గా అభివర్ణించారు.
: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలోకి చేరేందుకు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సిద్ధమయ్యాడు. ఈ నెల 12వ తేదీన చికోటి ప్రవీణ్ బీజేపీ కండువా కన్నుకోనున్నాడు. . రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరనున్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి చెరో మూడు అసెంబ్లీ స్దానాలను గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ స్దానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ది ముందంజలో ఉన్నారు.