Home / Automobile news
Cheapest Diesel SUV: భారతదేశంలో డీజిల్ కార్లకు ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది. అయితే కొన్ని సంవత్సరాలలో దేశంలో డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. పెట్రోల్ కార్లు కూడా చాలా మంచి ఇంజన్లతో రావడం ప్రారంభించాయి, వాటి సహాయంతో అవి మంచి మైలేజీని కూడా అందిస్తాయి. కానీ నేటికీ కారులో ఎక్కువగా ప్రయాణించే వారికి డీజిల్ వాహనాలే బెస్ట్ ఆప్షన్. అయితే మీరు సరసమైన […]
Volkswagen Virtus Offers: భారతీయ వాహన మార్కెట్లో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ తనదైన ముద్ర వేసుకుంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి తయరీదారుల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికి వాటిని తట్టుకొని నిలబడింది. తాజాగా కంపెనీ వర్టస్ సెడాన్ కారును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఏప్రిల్ నెలలో మిగిలిన MY2024 స్టాక్‌పై రూ. 1.50 లక్షల వరకు భారీ తగ్గింపు ఇస్తుంది. అలానే కస్టమర్లు దాని MY2025 […]
Top Suvs Waiting Period: దేశంలో ఎస్యూవీ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కొత్త మోడళ్ల రాకతో మార్కెట్ కళకళలాడుతోంది. ప్రతి నెలా డిమాండ్ పెరుగుతున్న కొన్ని ఎస్‌యూవీలు ఉన్నాయి, దీని కారణంగా వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతోంది. ఈరోజు వాహనం బుక్ చేసుకుంటే దాని డెలివరీకి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు అటువంటి ఫేమస్ ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం. Tata Nexon మీరు టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, […]
Hyundai Nexo: ప్రస్తుతం దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. దీని రీఛార్జ్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల కంటే వేగంగా ఉంటుంది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలు ఇంకా ప్రధాన స్రవంతి కానప్పటికీ, చాలా వాహన తయారీదారులు ఈ హైడ్రోజన్ మార్గం వైపు కదులుతున్నారు. హ్యుందాయ్ కూడా ఇందులో చేరింది. తన రెండవ తరం “Hyundai NEXO” హైడ్రోజన్ […]
Maruti Suzuki Grand Vitara Price Hike: మారుతి సుజికి ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచింది. నిజానికి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ప్రతి ఏడాది లాగానే ఏప్రిల్ నుంచి కొత్త కారు కొనడం ఖరీదైంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, నియంత్రణ మార్పులు, ఫీచర్ల కారణంగా కార్ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి వచ్చింది. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి కూడా తన వాహనాల ధరలను […]
India’s Best Selling Car: టాటా పంచ్ 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. ఇది 40 సంవత్సరాల తర్వాత మారుతి సుజుకీకి పెద్ద ఎదురుదెబ్బ. అయితే ఒక సంవత్సరం తర్వాత అంటే 2025 ఆర్థిక సంవత్సరంలో, మారుతి మరోసారి గొప్ప పునరాగమనం చేసింది. FY25లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతీ వ్యాగన్ఆర్ నిలిచింది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, మారుతి ఎర్టిగా, మారుతి బ్రెజ్జా, మారుతి స్విఫ్ట్ వంటి టాప్-10 కార్లను […]
Family Scooters: భారత్ మార్కెట్లోకి అనేక స్కూటర్లు వస్తున్నాయి. ఈ సెగ్మెంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది.లోకల్ అవసరాలు, సిటీ పరిధిలో ఇవి ఉపయోగంగా ఉంటాయి. అందుకే వీటిని అందరూ విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విభాగంలో హీరో, సుజికి, టీవీఎస్ కంపెనీలకు చెందిన స్కూటర్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెద్ద సీటుతో కూడిన ఫ్యామిలీ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో 125సీసీ సెగ్మెంట్లో లభించే ఉత్తమ పెట్రోల్ స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. Hero […]
Royal Enfield Record Sales: 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఆకట్టుకునే అమ్మకాలతో ముగించింది. ఈ FYలో కంపెనీ 1 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో కొత్త మైలురాయిని నెలకొల్పింది. కంపెనీకి ఇంతకమందున్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. అమ్మకాల నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో 10,09,900 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 11శాతం అద్భుతమైన వృద్ధిని సాధించింది. మార్చి 2025లో కంపెనీ అమ్మకాలు 34శాతం వృద్ధిని నమోదు చేశాయి. […]
Hero Splendor Disc Variant: ఇప్పటి వరకు దేశంలోని ఎంట్రీ లెవల్ బైక్‌లకు బ్రేకింగ్ పేరుతో డ్రమ్ బ్రేక్‌లు అందిస్తున్నారు. అవి అంత ప్రభావవంతంగా పనిచేయవు. నేటికీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ స్ప్లెండర్ ప్లస్ కూడా డ్రమ్ బ్రేక్‌లతో వస్తోంది. అయితే ఇప్పుడు త్వరలో ఈ బైక్ డిస్క్ బ్రేక్‌లో కూడా కనిపించనుంది. హీరో మోటోకార్ప్ ఇప్పుడు డిస్క్ బ్రేక్‌తో అత్యధికంగా అమ్ముడైన బైక్ స్ప్లెండర్ ప్లస్‌ను తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం […]
Bajaj Pulsar Celebratory Offers: బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. బజాజ్ ఆటో లిమిటెడ్ ఈ బైక్‌ను 50కి పైగా దేశాల్లో 2 కోట్ల యూనిట్లకు పైగా విక్రయించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ మోటార్‌సైకిల్ భారతదేశం, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్‌లో విస్తృతంగా అమ్ముడవుతోంది. పల్సర్ ఈ అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకొని కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు కస్టమర్లు రూ.7300 వరకు ఆదా […]