Hero Splendor Disc Variant: అదిరిందయ్యా హీరో.. డిస్క్ బ్రేక్‌తో స్ప్లెండర్ ప్లస్.. మన మిడిల్ క్లాస్‌కి ఇది చాలు..!

Hero Splendor Disc Variant: ఇప్పటి వరకు దేశంలోని ఎంట్రీ లెవల్ బైక్‌లకు బ్రేకింగ్ పేరుతో డ్రమ్ బ్రేక్‌లు అందిస్తున్నారు. అవి అంత ప్రభావవంతంగా పనిచేయవు. నేటికీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ స్ప్లెండర్ ప్లస్ కూడా డ్రమ్ బ్రేక్‌లతో వస్తోంది. అయితే ఇప్పుడు త్వరలో ఈ బైక్ డిస్క్ బ్రేక్‌లో కూడా కనిపించనుంది. హీరో మోటోకార్ప్ ఇప్పుడు డిస్క్ బ్రేక్‌తో అత్యధికంగా అమ్ముడైన బైక్ స్ప్లెండర్ ప్లస్‌ను తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ బైక్ ఇటీవల డిస్క్ బ్రేక్‌లతో కనిపించింది. ఇది కొత్త మాట్టే కలర్‌లో కూడా వస్తుంది. ఈ బైక్‌కి XTEC డిస్క్ బ్రేక్ లభిస్తుంది. అర్బన్, హైవేలో మెరుగైన బ్రేకింగ్ కోసం మాత్రమే డిస్క్ బ్రేక్ ఇందులో అందిస్తున్నారు.
ప్రస్తుతం కొత్త స్ప్లెండర్ ప్లస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ.77,176 నుండి ప్రారంభమవుతుంది. కొత్త మోడల్ ధర రూ.80,000 నుంచి ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. కొత్త స్ప్లెండర్ ప్లస్ ఇప్పటి వరకు అత్యంత అధునాతన మోటర్ సైకిల్‌గా నిలిచింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్.
కొత్త స్ప్లెండర్ ప్లస్ ముందు భాగంలో 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ సదుపాయం కనిపిస్తుంది. ఈ బైక్‌లో 97.2సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 8.02పిఎస్, 8.05ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజన్ OBD2B నిబంధనలతో వస్తుంది, దీని వలన ఇది మెరుగైన మైలేజ్, మంచి పనితీరును అందిస్తుంది. బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్,వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు కనిపిస్తాయి.
ప్రతి నెల స్ప్లెండర్ ప్లస్ దేశంలోనే బెస్ట్ సెల్లర్. ఈ బైక్ విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ బైక్ డిస్క్ బ్రేక్‌తో వస్తే, దాని అమ్మకాలు మరింత పెరగచ్చని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే ఈ బైక్‌లో డిస్క్ బ్రేక్‌లకు చాలా కాలంగా డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిస్క్ బ్రేక్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- Bajaj Pulsar Celebratory Offers: వామ్మో! ఏందిరా సామీ.. పల్సర్‌ను 2 కోట్ల మంది కొనేశారు.. ఏప్రిల్ స్పెషల్ డిస్కౌంట్స్..!