Home / AP Politics
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఈ మేరకు రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్ కూడా నడపడం విశేషం. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలువురు రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు.
తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు ఇంచార్జ్ గా బాధ్యతలు ఇవ్వడంపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవుల కోసం కన్నా మూడు పార్టీలు మారారు
విజయవాడలో రాజకీయాలు ఎండ దెబ్బ కంటే మరింత వేడిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని విషయం బెజవాడలో హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా ఇటీవల కాలంలో టీడీపీపై గుర్రుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖా ముఖి నిర్వాహించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది.
ఏపీ సీఎం జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై.. తమ్మినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ జెండా తెలుగు జాతికి అండ అని.. తెలుగుదేశం పార్టీ జెండా చూస్తే పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు వైభవంగా నిర్వహిస్తున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. సైకిల్ అంటేనే సంక్షేమం,
తెలుగుదేశం పార్టీ.. మహానాడు 2023 కు రెడీ అయ్యింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి మహానాడు నిర్వహణలో కీలక పాత్ర వహిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపటి క్రితం ఎయిర్ట్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన పవన్ అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలు దేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని పవన్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.