Home / ap capital
ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి... ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.
ఏపిలో మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా శనివారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది.
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.
ఏపీ రాజధాని పనులు 40శాతం పూర్తి అయ్యాయని, అసెంబ్లీ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతమే రాజధానిగా చూడాలని, ప్రస్తుత ఏపీ రాజధాని సంక్షోభానికి ముఖ్యమంత్రి జగన్ కారణమని కేంద్ర మంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.