Home / Andhra Pradesh
Guntur West Politics in Andhra Pradesh: ఆ జిల్లాలో ఓ నియోజకవర్గం అనధికారికంగా మైనార్టీ నియోజకవర్గం. ఏ పార్టీ ఐనా సరే..మైనార్టీలనే అభ్యర్థులుగా ప్రకటించడం అక్కడ ఆనవాయితీ. టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించినా సొంత పార్టీలో నేతల కుమ్ములాటతో సతమతమౌతున్నాడు. స్ట్రీట్ ఫైటింగ్స్ కూడా తప్పడంలేదట. మరోవైపు ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి..తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అంతా తల పట్టుకుంటున్నారంట. నియోజకవర్గంలో నేతలతీరు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా […]
South Africa former Cricketer Jonty Rhodes visited BNI Vijayawada: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్‌కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణాళికలు ఉండాలి.. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. […]
AP Govt Serious on Peddireddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. మొత్తం 75 ఎకరాల అటవీ ప్రాంతానికి చెందిన భూములను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబుకు […]
Aarogyasri Services Stopped In Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల్ని బీమా పరిధిలోకి తీసుకురావటం, తమకు చెల్లించాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిల చెల్లింపులు జరగకపోవటంతో ఇక.. వైద్యం అందించలేమంటూ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఇటు.. తెలంగాణలోనూ రూ. 1000 కోట్ల పెండింగ్ బిల్లుల అంశం కారణంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. అయితే, ఇదే అదనుగా కొన్ని ఆస్పత్రులు నిస్సహాయ స్థితిలో […]
Cancer Health Campaign in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను కేన్సర్ విముక్త రాష్ట్రంగా మార్చేందుకు కూటమి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 40 వేల మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అందిరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సర్కారు గత ఏడాది నవంబరు 14న కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి వందమందిలో ఒకరు కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇవీ […]
Andhra Pradesh to interlink rivers with Godavari-Banakacherla project: గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయటమే గాక సస్యశ్యామలం చేయటం సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు తెలుగుతల్లికి జలహారతి అనే పేరును నిర్ధారించారు. ప్రాజెక్టు ఇందుకే.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని, వ్యవసాయాధారిత రంగంలో మరెన్నో ఉపాధి […]
Cyclone Effect On Andhra Pradesh: మరో తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, కోస్తా ప్రాంతాలకు ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ […]
Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]
BJP declares candidates for Andhra Pradesh, Haryana and Odisha Rajya Sabha bypolls: బీజేపీ రాజ్యసభ ఉపఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా, ఏపీ […]
Janasena Leader Warns Pushp 2 Release Stop in AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ సందడి కొనసాగుతుంది. ఎక్కడ చూసిన పుష్ప పుష్ప అంటూ మూవీ జపం చేస్తున్నారు. టికెట్స్ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లో హౌజ్‌ఫుల్ కనిపిస్తున్నాయి. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి పుష్ప 2 టీం ఆనందంలో ఉంది. ఓవైపు మూవీ రిలీజ్ సందడి కొనసాగుతుంటే.. మరోవైపు అల్లు అర్జున్‌కి హెచ్చరికలు వస్తున్నాయి. ఏపీ […]