Home / Andhra Pradesh
నవరస నటనాసార్వభౌముడిగా ఎన్నో వందల సినిమాలతో ప్రజలను మెప్పించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. కేజీఎఫ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఆ చిత్ర బృందం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణ పాల్గొని.. హీరో యశ్ గురించి ప్రస్థావించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పై మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు
ట్రైన్ దిగుతున్న సమయంలో జారిపడి ఒక యువతి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది.
తమిళనాడు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాలర్లు ఎవరూ సముద్రంపైకి వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో మెడికల్ స్టూడెంట్స్ ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని ఆ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కాంలో మరో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో వైకాపా నేత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ఈడీ అధికారులు చేర్చిన సంగతి విదితమే. అయితే దీనిపై స్పందించిన మాగుంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎలాంటి పాత్ర లేదని గురువారం స్పష్టం చేశారు
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ఏపీ సీఎం జగన్ పక్కాగా వ్యూహరచన చేస్తున్నారట. అందుకోసం సరైన ముహూర్తాన్ని కూడా ఎంచుకుంటున్నారట. అన్ని విధాలుగా అనుకూలమైన డిసెంబర్ నెల బెటర్ అని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కమ్మ వర్గానికి ఎపీ ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఓడిపోయినప్పటికి ఆప్కాబ్ ఛైర్మన్ ఇచ్చారని, అదే విధంగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఏపీ సీఎం జగన్ సోమవారం నరసాపురం పర్యటన సందర్బంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చెట్లు నరికివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.