Home / Andhra Pradesh
Covid-19 Positive Case Register in Visakha: దేశంలో కరోనా కలవరపెడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా విశాఖలో వెలుగు చూశాయి. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్ వచ్చింది. మహిళను వారం రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా […]
Hanuman Shobha Yatra in Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర అత్యంత వైభంగా జరిగింది. హిందూ సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వేలాది మందితో ప్రారంభమై పట్టణ వీధుల సాగింది. యువకులు, భక్తులు అత్యధిక మంది కాషాయం జెండాతో ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు […]
Somireddy Challenge to YS Jagan: విశాఖలో ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపుపై వైసీపీ అధినేత జగన్ ఆరోపణలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ, వడ రేటుకు, ఒక రూపాయికి భూమిని కేటాయించి ఉంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పును కోరదామని అన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను […]
AP CM Chandrababu Review Meeting on Agriculture Department: రాష్ట్రంలో ఉత్పత్తి చేసే ప్యూర్ జ్యూస్ లపై జీఎస్టీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో, తిరుమల తిరుపతిలో భక్తులకు ప్రసాదంగా మ్యాంగ్ జ్యూస్ అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే రైతు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడుతానని స్ఫష్టం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరల నిర్దారణ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు, రైతు సమస్యలను పరిష్కరించేందుకుగాను సీఎం చంద్రబాబు […]
YS Jagan serious on AP Government: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగట్లేదని ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో డైలాగులు చెప్పారని ప్రస్తుతం వాటన్నింటిని ఆయన మర్చిపోయారని విమర్శించారు. అభివృద్ధి మంత్రం ఉందని, […]
Srisailam Reservoir: తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాలో ద్రోణి, అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఆయా జిల్లల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద రాక ప్రారంభమైంది. ఇక కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టులకు కూడా […]
Rain Alert to Telangana and Andhra Pradesh: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ చేసింది. ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి […]
AP: జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబంధించి.. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. నెలరోజులపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని జూన్ 21న విశాఖ బీచ్ లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో […]
Chittoor: ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కుప్పం పర్యటన ముగించుకుని సాయంత్రానికి అమరావతికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా కొద్దిరోజులుగా తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మ జాతర సాగుతోంది. దీంతో […]
AP: ఏపీలో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడొచ్చని సూచించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణశాఖ చెప్పింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు […]