Home / amitabh bachchan
కీర్తింపబడడం ఓ అదృష్టం. ఆ ఆనందాన్ని నిలుపుకోవడం మరింత అదృష్టం. దాన్ని పాటించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ధరించిన పాదరక్షలు వదిలి మరీ నమస్కరించడం అతని సంస్కారానికి కొలబద్దగా నిలిచింది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ పై తన ఎడమకాలికి గాయమయిందని తన బ్లాగ్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా భారీ అంచనాలతో ఇటీవలె ప్రేక్షకులముందు విడుదలైన చిత్రం బ్రహ్మాస్త్రంపై ఫ్లాప్ టాక్ నడుస్తుంది. సినీ విశ్లేషకులు ఈ చిత్రానికి ఇచ్చిన రివ్యూల వల్ల మల్టీప్లెక్స్ సంస్థలైన పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.
న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో తమ ఇంటివద్ద బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లైఫ్ సైజ్ విగ్రహాన్ని భారతీయ-అమెరికన్ కుటుంబం ఏర్పాటు చేసింది.ఎడిసన్‌లోని రింకు మరియు గోపీ సేథ్‌ల ఇంటి వెలుపల భారీ ఎత్తున ప్రజలు గుమికూడి పటాసులు కాల్చారు. గోపీ సేథ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ గారే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ గారు గేమ్‌షో కౌన్ బనేగా కరోడ్‌పతి షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డట్లు తెలిసిన సమాచారం.