Last Updated:

BCCI Secretery: బీసీసీఐ సెక్రటరీ ఎవరో? రేసులో పలువురి పేర్లు

BCCI Secretery: బీసీసీఐ సెక్రటరీ ఎవరో? రేసులో పలువురి పేర్లు

Who will be next BCCI secretary: మొన్నటివరకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. బీసీసీఐ నియమాల ప్రకారం.. బోర్డులోని ఏ ఆఫీస్ బేరర్ రాజీనామా చేసినా, 45 రోజుల్లోపు బోర్డు జనరల్ బాడీ మీటింగ్ జరిపి, ఆ రాజీనామా చేసిన వ్యక్తి స్థానంలో మరొకరిని ఎన్నుకోవాల్సి ఉంది. అదే సమయంలో ఈ భేటీకి కనీసం 4 వారాల ముందుగా ఎన్నికల అధికారినీ ప్రకటించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ పదవికి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రేసులో గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా ఉన్న దేవ్‌జిత్ సైకియా ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ పేరు కూడా వినిపించినా, తాను ఈ పోటీలో లేనని ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో అనిల్, దేవజిత్‌లలో ఒకరికి ఈసారి ఛాన్స్ దక్కనుందనే అభిప్రాయం వినిపిస్తోంది.