Australia vs India: పడి లేచిన ఆస్ట్రేలియా.. ఆధిక్యం ఎంతంటే?
Australia vs India fourమేest match Australia lead by 333 runs: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పడి లేచింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లయన్(341), బోలాండ్(10) పరుగులతో ఉన్నారు. అయితే వీరిద్దరూ 9వ వికెట్‌కు 55 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆస్ట్రేలియా 173 పరుగులకు 9వ వికెట్ కోల్పోయింది. అయితే నాలుగో రోజే ఆసీస్ ఆలౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ చివరి వికెట్ తీసేందుకు భారత్ బౌలర్లు చెమటోడ్చారు. అయినప్పటికీ వికెట్ దక్కలేదు. దీంతో ఆస్ట్రేలియా 333 పరుగుల లీడ్ సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్ల పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, జడేజాకు ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ 369 పరుగులకు ఆలౌట్ అయింది.