Last Updated:

Mad Movie Review : యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ “మ్యాడ్” హిట్ కొట్టినట్టేనా..? రివ్యూ, రేటింగ్ ??

Mad Movie Review : యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ “మ్యాడ్” హిట్ కొట్టినట్టేనా..? రివ్యూ, రేటింగ్ ??

Cast & Crew

  • నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ (Hero)
  • శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ (Heroine)
  • రఘుబాబు, 'రచ్చ' రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి, అనుదీప్ కేవీ తదితరులు (Cast)
  • కళ్యాణ్ శంకర్ (Director)
  • హారిక సూర్యదేవర, సాయి సౌజన్య (Producer)
  • భీమ్స్ సిసిరోలియో (Music)
  • షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి (Cinematography)
2.8

Mad Movie Review : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌.. సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ “మ్యాడ్‌”. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ  ఇంజినీరింగ్‌ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు తెలుస్తుంది. అక్టోబరు 6న థియేటర్‌లలో ఈ చిత్రం విడుదల కాగా..ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించిందా.. లేదా తెలుసుకుందాం..

సినిమా కథ.. 

అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. అశోక్ తక్కువ మాట్లాడతాడు. కొంచెం ఇంట్రావర్ట్ టైపు! అతను అంటే జెన్నీ (అనంతిక సనీల్ కుమార్)కి ఇష్టం. మరి, అతనికి? అమ్మాయిలు కనిపిస్తే మనోజ్ ఫ్లర్ట్ చేస్తాడు. అటువంటి అబ్బాయి శృతి (శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి ఇష్టపడతాడు. అతనికి ఆ అమ్మాయి ఎందుకు దూరం అయ్యింది? మళ్ళీ దగ్గర అయ్యిందా? లేదా? తనకు అమ్మాయిలు పడరని బలమైన నమ్మకంతో ఉన్న దామోదర్ కి ఓ అజ్ఞాత అమ్మాయి లేఖ రాస్తుంది. రోజూ ఫోనులో మాట్లాడుతుంది. ఆమె ఎవరు? ఈ కథలో రాధ (గోపికా ఉదయన్) పాత్ర ఏమిటి? చివరకు ఎం జరిగిందో తెలుసుకోవాలంటే సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.

మూవీ విశ్లేషణ (Mad Movie Review).. 

కాలేజి క్యాంపస్‌లో స్టోరీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘హ్యాపీ డేస్’. అప్పటి నుంచి ఆ తరహా కథలు వస్తూనే ఉంటున్నాయి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే నిర్మాత కథ గురించి, లాజిక్స్ గురించి అన్నింటినీ మర్చిపోయి నవ్వుక్కోవచ్చు అని చెప్పిన మాట నిజం అనిపిస్తుంది. ముందు కథ విషయానికి వస్తే రొటీన్ రొట్ట అని చెప్పవచ్చు. ఇక లాజిక్స్ సంగతి మాట్లాడకపోవడమే బెటర్. అయితే కామెడీ మాత్రం  బలంగా వర్కవుట్ అయ్యింది. స్టార్టింగ్ టు ఎండింగ్ పంచ్ డైలాగ్స్ పేలాయి. కళ్యాణ్ శంకర్ అండ్ టీమ్ హీరోలతో పాటు మిగతా క్యారెక్టర్లకు కూడా క్యారెక్టరైజేషన్, టిపికల్ మేనరిజమ్స్ డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ పాటలు అంతగా అలరించలేకపోయాయి.

ఎవరెలా చేశారంటే..

హీరోగా తొలి సినిమా అయినప్పటికీ.. నార్నే నితిన్ చక్కగా చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన కటౌట్, స్టైల్ బావున్నాయి. మ్యాడ్‌లో ఉన్న ప్రతి పాత్రకు ప్రాధాన్యత దక్కింది. ఈ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన నార్నె నితిన్.. అశోక్ పాత్రలో లీనమైపోయాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సీరియస్ లుక్‌లో కనిపించినా పతాక సన్నివేశాలకు వచ్చే సరికి ఈజీగా చేసుకుంటూ వెళ్లాడు. తన ఎలివేషన్ సీన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. ఇక సంగీత్ శోభన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. అమ్మాయిలు గౌరి, అనంతిక చక్కటి నటన ప్రదర్శించారు. రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు తమ పాత్రల పరిధి మేర నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలో మెరిసి కేకలు పుట్టించాడు. దర్శకుడు కల్యాణ్‌ శంకర్చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సులభంగా చెప్పేశాడు. ప్రతి సన్నివేశంలో నవ్వులు పంచాయి. పాటల విషయంలో భీమ్స్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణం పరంగా ఉన్నతంగా అనిపించింది. నిర్మాతగా అడుగుపెట్టిన హారిక సూర్యదేవరకు మొదటి ప్రయత్నం బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు.

కంక్లూజన్.. 

“అన్నీ” మర్చిపోయి నవ్వుకోవచ్చు

ఇవి కూడా చదవండి: