Last Updated:

Jawan Movie Review : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ “జవాన్” మూవీ రివ్యూ.. మళ్ళీ వెయ్యి కోట్లు కొడతారా ???

Jawan Movie Review : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్  “జవాన్” మూవీ రివ్యూ.. మళ్ళీ వెయ్యి కోట్లు కొడతారా ???

Cast & Crew

  • షారూఖ్ ఖాన్ (Hero)
  • నయనతార (Heroine)
  • విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, దీపికా పదుకోనే, యోగి బాబు తదితరులు (Cast)
  • అట్లీ (Director)
  • గౌరి ఖాన్, గౌరవ్ వర్మ (Producer)
  • అనిరుధ్ రవిచందర్ (Music)
  • జీకే విష్ణు (Cinematography)
3.5

Jawan Movie Review : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేసిన చిత్రం “జవాన్”. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పఠాన్’తో హిందీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్ షారుక్. మళ్ళీ వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరిసింది. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేస్తుండడం గమనార్హం. అలానే ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలోనే పఠాన్ తో షారూఖ్ ఆడియన్స్ ను మళ్ళీ మెప్పించాడా.. లేదా.. మూవీ రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

విక్రమ్ రాథోడ్ (షారుక్ ఖాన్) భారత్, చైనా సరిహద్దులో ఉన్న ఒక గ్రామం దగ్గర ఉండే నదిలోకి కొట్టుకొస్తాడు. వంటి నిండా బుల్లెట్ గాయాలతో ఉన్న అతన్ని ఆ గ్రామంలో ఉండే వారు వైద్యం చేసి బ్రతికిస్తారు. అతను ప్రాణాలతో బయట పడినప్పటికీ తన గతాన్ని మర్చిపోతాడు. కానీ ఊహించని రీతిలో 30 సంవత్సరాల తర్వాత అతను ఆరుగురు అమ్మాయిలతో (ప్రియమణి, సాన్యా మల్హోత్రా గ్యాంగ్) కలిసి మెట్రో ట్రైన్ హైజాక్ చేస్తాడు. హైజాకర్లతో మాట్లాడటానికి ప్రభుత్వం తరఫున నర్మద (నయనతార) వస్తుంది. అదే మెట్రోలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) కూతురు ఆలియా (ఆశ్లేష ఠాకూర్) కూడా ఉంటుంది. అసలు విక్రమ్ రాథోడ్ ఎవరు ? తనకు కాళీ గైక్వాడ్‌కి సంబంధం ఏంటి ? అసలు హైజాక్ ఎందుకు చేశాడు ?? మరో షారూఖ్ పాత్ర ఏంటి ??? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే..

Jawan

మూవీ విశ్లేషణ..

సాధారణంగా అట్లీ సినిమాల్లో పెద్దగా ట్విస్ట్ లు ఉండకుండా ఊహించిన విధంగానే పొత్తు ఉంటుంది. కానీ తన మేకింగ్ తో, ఎమోషన్స్ తో మ్యాజిక్ చేసేస్తుంటాడు. ఇక ఈ మూవీలో కూడా స్టోరీ రొటీన్ అయినప్పటికీ.. అదిరిపోయేలా ఉండే యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ తో మళ్ళీ ప్రేక్షకులను ఫిదా చేసేశాడు. ఆ మ్యాజిక్ కి షారూఖ్ లాంటి సూపర్ స్టార్ హీరో తోడు అయితే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనడంలో సందేహం లేదు. మూవీ విశ్లేషణ లోకి వెళ్తే.. మూవీ ఫస్ట్ 30 నిమిషాలు ఆడపోయాయి.. ఒక పవర్ ఫుల్ వ్యక్తి తన గతం మర్చిపోయి.. 30 సంవత్సరాల తర్వాత మెట్రో ట్రైన్ హైజాక్.. ఆ తర్వాత రివీల్ అయ్యే కీలకమైన ట్విస్ట్ అందరికీ షాక్ ఇస్తుంది. ప్రథమార్థం అంతా చాలా రేసీగా, ఫాస్ట్‌గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే గూస్‌బంప్స్ ఇవ్వడం ఖాయం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది.

సెకండాఫ్‌లో విక్రమ్ రాథోడ్ ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా సాగుతుంది. షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి ఫేస్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా సాగి ఆ తర్వాత మళ్ళీ వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్ లో ఒక బాలీవుడ్ స్టార్ క్యామియో.. ఆ తర్వాత ట్విస్ట్‌ షారుక్ ఖాన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ గ్యారంటీ అనేలా చేశాయి. మొత్తానికి ఒక సౌత్ మాస్ మసాలా స్టోరీకి బాలీవుడ్ స్టార్‌ తోడు అయ్యి భారీ హిట్ కకొడుతుంది అనడంలో సందేహం లేదు. కానీ కొన్ని లాజిక్స్ మాత్రం కొంచెం మింగుడుపడవు.. ఒక పాట మాత్రం స్టోరీలో ఇరికించినట్లు ఉంది.

ఎవరెలా చేశారంటే.. 

ఇక నటీనటుల విషయానికి వస్తే… విక్రమ్ రాథోడ్, ఆజాద్ రెండు పాత్రల్లోనూ షారుక్ ఖాన్ రఫ్ఫాడించేశారు. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ పాత్ర చాలా మాస్‌గా, స్వాగ్‌తో కనిపించి ఆడియన్స్‌కు మెప్పిస్తుంది. నయనతార కూడా ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి యాక్షన్ రోల్ లో అదరగొట్టింది. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి మరోసారి గట్టి పోటీ ఇచ్చారు. బాలీవుడ్‌లో ఆయనకు మరిన్ని విలన్ పాత్రలు దక్కే అవకాశం ఉంది. చిన్న పిల్లలకు అట్లీ సినిమాల్లో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో కూడా అది కనిపిస్తుంది. నయనతార కూతురు, షారుక్ ఖాన్ మధ్య ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. దీపికా పడుకునే కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.  ప్రియమణి, సాన్యా మల్హోత్రా గ్యాంగ్‌లో అమ్మాయిలు, తెలుగు అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు ఉన్నతలో మెప్పించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు సోసో గానే ఉన్నాయి.. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్‌బంప్స్ ఇస్తుంది. జీకే విష్ణు ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా అనిపించాయి. కెమెరా పనితనం బాగుంది.

 

 

Jawan Movie Review

కంక్లూజన్.. 

సౌత్ మాస్ కి.. నార్త్ క్రేజ్ మిక్స్ అయిన బ్లాక్ బస్టర్

ఇవి కూడా చదవండి: