Home / పొలిటికల్ వార్తలు
మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం మూడింతల అవినీతికి పాల్పడిందని బీజేపి నేత సునీల్ ధియోధర్ విమర్శించారు. నాడు ఒక్క రాజధాని పేరుతో అవినీతి తెదేపా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తన భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కు ఆహ్వానం పంపించారు. బీహార్లోని కాంగ్రెస్ నాయకులు ఆదివారం తేజస్విని అతని తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్ మరియు రబ్రీ దేవిలను కలుసుకున్నారు
సర్పంచ్ గా గెలిచిన తర్వాత శాసనసభ్యుల గురించి మాట్లాడాలని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వైకాపా పై పలు ఆరోపణలు గుప్పించిన నేపధ్యంలో రోజా ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను చర్చించకుండా విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. బయట మీడియా ముందు డ్రామాలు ఒక్కటే తెదేపాకు తెలుసునని మంత్రి కాకాని ఎద్దేవా చేశారు.
సమాచారం మేరకు కనిమొళి తల్లి రాజాత్తి అనారోగ్యంతో చికిత్స నిమిత్తం జర్మనీలోని ఓ వైద్యశాలలో చేరారు. విషయాన్ని తెలుసుకొన్న అమిత్ షా ఎంపీ కనిమొళితోపాటు ఆమె తల్లి విదేశాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయాలంటూ భారత రాయభార కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత శుక్రవారం కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేయడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం అయ్యింది. కోన రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కోలగట్లను ఎంపిక చేశారు.
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టిడిపి శాసనసభాపక్షం ''ఛలో అసెంబ్లీ'' పేరిట వినూత్న నిరసన చేపట్టింది. వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మందడం నుండి అసెంబ్లీ ప్రాంగణం వరకు ఎడ్లబళ్లపై వెళ్లేందుకు నారా లోకేష్ తో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు.
ఈ సారి ఎన్నికల్లో బలంగా పోరాడగలిగె అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇస్తామని తెలిపారు.అసెంబ్లీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
అమరావతి రైతుల పార్ట్ 2 పాదయాత్ర నేపధ్యంలో ఏపి మంత్రులు తమ స్వరాన్ని పెంచారు. పాదయాత్ర ఆధ్యంతం మాజీ సీఎం చంద్రబాబు నేపధ్యంలోనే సాగుతుందని పదే పదే చెబుతున్నారు
కాంగ్రెస్ లేకుండా భాజాపా వ్యతిరేక ఫ్రంట్ వైపు ఊవిర్ళూలుతున్న ప్రతిపక్ష పార్టీలంతా మూర్ఖుల స్వర్గంలో జీవిస్తున్నారని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆయన పిటిఐ వార్త సంస్ధతో పలు విషయాలు తెలియచేశారు