Home / పొలిటికల్ వార్తలు
బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అశోక్.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వివేకానంద రెడ్డి హత్యపై సీబిఐకి సహకరించడం లేదు, కేసును మరో రాష్ట్రానికి తరలించాలంటూ వివేక కూతురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే సీబిఐ బృందం కడపలో విచారణ చేపట్టడం సర్వత్రా చర్చకు దారితీసింది
తాను వచ్చే ఎన్నికల్లో ఏపీలోని గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి ఎోటీ చేస్తానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నువ్వు అరాచక శక్తి ఐతే దాన్ని తుదముట్టించే శక్తి నాదని చంద్రబాబు ఢీ అంటే ఢీ అన్న రీతిలో మాట్లాడారు.
చంద్రబాబు సర్కార్ హయంలో స్టేట్ డేటా సెంటర్ నుండి డేటా చోరీ జరిగిందని ఏపీ శాసనసభ సంఘం తేల్చింది. కాల్ ట్యాపింగ్ నుంచి సమాచారం దొంగింలించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది.
ఏపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపును మాత్రం వదలడం లేదు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యమిస్తుంది. తాజాగా మాజీ మంత్రి నారాయణను విదేశాలకు వెళ్లకుండా తలపెట్టిన లుకౌట్ నోటీసును కోర్టు పక్కన పెట్టింది
మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం ఎదురయింది. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ ను టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు.
ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.
కట్టేసి కొట్టిన ఘటనలో తనను వర్చువల్ స్ధానంలో విచారణ జరపాలని పేర్కొన్న కోర్టు ఉత్తర్వులను సైతం ఏపీ సీఐడి అధికారులు ఉల్లంఘిస్తున్నారని పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణం రాజు మీడియాతో పేర్కొన్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు వడోదర విమానాశ్రయంలో 'మోదీ, మోదీ' నినాదాలతో కొందరు స్వాగతం పలికారు. అయితే కేజ్రీవాల్ దీనిపై పెద్దగా స్పందించకుండా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.