Last Updated:

Peddireddy Ramachandra Reddy: విద్యుత్ బకాయి ఎగ్గొట్టేందుకే కోర్టు మెట్లు

ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి 6వేల కోట్లు చెల్లించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుందని ఏపిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు

Peddireddy Ramachandra Reddy: విద్యుత్ బకాయి ఎగ్గొట్టేందుకే కోర్టు మెట్లు

Tirupati: ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి 6వేల కోట్లు చెల్లించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుందని ఏపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపి 1700కోట్లను విద్యుత్ బకాయిలు చెల్లించాలని సీఎం కేసిఆర్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేవలం ఉద్దేశపూర్వకంగానే జగన్ కుటుంబానికి అంటగడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 22న కుప్పంలో పర్యటించనున్న జగన్ చేతుల మీదుగా మూడో విడత చేయూత పధకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల పైన అడ్డదిడ్డంగా విసుర్లు విసిరే రాష్ట్ర మంత్రులు, విద్యుత్ బకాయిల పై మాత్రం ఆచితూచి మాట్లాడడం పట్ల ప్రజలు చర్చించుకొంటున్నారు. 

ఇవి కూడా చదవండి: