Home / జాతీయం
ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా 2016లో కెవిఐసి ఛైర్మన్ గా ఉన్నపుడు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని తన ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని ఆప్ ఎమ్మెల్యే దురేగేశ్ పాఠక్ సోమవారం ఆరోపించారు. అతను కెవిఐసి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, నోట్ల రద్దు జరిగింది, అక్కడ పని చేస్తున్న క్యాషియర్ తాను బలవంతంగా నోట్ల మార్పిడికి పాల్పడ్డానని లిఖితపూర్వకంగా తెలిపాడు అతనిని సస్పెండ్ చేయడం దురదృష్టకరం.
రాబోయే రెండు నెలల్లో, దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తాము అంటై రిలయన్స్ ఇండస్టీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.
నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ద్వారా సూపర్‌టెక్ లిమిటెడ్ రియల్టీ కంపెనీకి సుమారు 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం విషయానికి వస్తే నిర్మాణ వ్యయంతో పాటు బ్యాంకు వడ్డీలు తదితర అంశాలు కలిసి ఉన్నాయయని కంపెనీ చైర్మన్ ఆర్ కె అరోరా అన్నారు.
మాజీ రాజ్యసభ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి రామసేతులో నటించిన అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసును పంపించారు.
కాంగ్రెస్‌లో చేరడం కంటే బావిలో మునిగిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000కు పైగా పందులు చనిపోయాయి.దీనితో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు మరియు వాటి మాంసం మరియు వాటి మాంసాన్ని నిషేధిస్తూ కలెక్టర్ మనోజ్ పుష్పనిషేధాజ్ఞలు జారీ చేసారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావుతో పాటు మరో నలుగురిపై నమోదైన లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 (పోక్సో) కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.
సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, జై రాం రమేశ్ వెల్లడించారు.వర్చువల్‌గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను తెలిపారు. సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు.